corona effect : ఉత్తరాఖండ్ లో యువత,చిన్నారులపై కరోనా పంజా..60వేలకుపైగా కేసులు

corona effect : ఉత్తరాఖండ్ లో యువత,చిన్నారులపై కరోనా పంజా..60వేలకుపైగా కేసులు

Corona Effect (1)

Updated On : May 23, 2021 / 11:42 AM IST

Uttarakhand corona : కరోనా మొదటిసారి కంటే మరింత బలంగా మారి సెకండ్ వేవ్ లో జనాలను హడలెత్తిస్తోంది. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ లో కరోనా సెకండ్ వేవ్ యువతపైనా..చిన్నారులపై పంచా విసురుతోంది. అలా ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్ లో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డుతున్న చిన్నారుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. అలా యువతపై కూడా కరోనా కోరలు పడుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే 11 వందలమందిపైగా చిన్నారులకు కరోనా సోకింది. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో అధికారులను ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బారిని పడిన చిన్నారులంతో 10 ఏళ్లలోపువారే కావటం గమనించాల్సిన విషయం. చిన్నారులకు కరోనా సోకిన కేసులు పెరుగుతుండటంతో ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. కరోనా సోకిన చిన్నారులంతా ఆస్ప‌త్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నార‌ని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది.