దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లోకి వెళ్లిన 80 నగరాలు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లోకి వెళ్లిన 80 నగరాలు

Updated On : March 23, 2020 / 4:24 AM IST

కరోనా ప్రధాన పట్టణాలను వణికిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలు మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలను నిర్బంధించారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, పశ్చిమబెంగాల్, ఛండీగఢ్, చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరి, ఉత్తరాఖాండ్‌లు ఈ లాక్ డౌన్ లో భాగమయ్యాయి. 

ఇందులో భాగంగా రైళ్లు, మెట్రో సర్వీసులు, ఇంటర్ స్టేట్ బస్సులను దేశ వ్యాప్తంగా రద్దు చేశారు. మార్కెట్లు, మాల్స్, సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, జిమ్స్ అన్ని మూసి ఉంచుతారు. కొన్ని ప్రాంతాల్లో 144సెక్షన్ కూడా అమల్లో ఉంది. నలుగురికి మించి గుమిగూడి ఉంటే వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీలతో మీటింగ్ అనంతరం ఆదివారం ఉదయం క్యాబినెట్ సెక్రటరీ ఈ లాక్ డౌన్‌ను ప్రకటించారు.  

ఢిల్లీ అన్ని మార్కెట్లను మూసేసి.. రాష్ట్ర సరిహద్దులు బ్లాక్ చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఉదయం 6గంటల నుంచి మార్చి 31వరకూ లాక్ డౌన్ ను ప్రకటించేశారు. ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే అన్ని విమాన సర్వీసులను నిలిపేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్తుంది. క్యాబ్ లు, ఆటోలు దేశ రాజధానిలో తిరిగేందుకు వీల్లేదు. 

ప్రభుత్వ వాహనాలతో పాటు ప్రైవేట్ వెహికల్స్‌కు కూడా అనుమతుల్లేవు. 24గంటలు అత్యవసర సేవలు అందించే పోలీసులు, హెల్త్, ఫైర్, ఖైదీలు, ఎలక్ట్రిసిటీ, వాటర్, కెమిస్టులు, పెట్రోల్ పంపులు దీని నుంచి మినహాయింపు తీసుకున్నాయి. తెలంగాణ కూడా సరిహద్దులు మూసేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బంద్ చేసింది. సమ్మర్ హాలిడే స్పాట్ అయిన గోవాకు వెళ్లకుండా పర్యాటకులను అడ్డుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మార్చి 31వరకూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తుంది. 

కర్ణాటక సైతం అత్యవసర సేవలు, నిత్యవసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపంది. కిరాణా వస్తువులు, మిల్క్, చేపలు, మాంసం, కూరగాయలకు అనుమతి ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లు సైతం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. 

నిబంధనలను కఠినతరం చేసినా.. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క ఆదివారమే 3కరోనా మృతులు నమోదయ్యాయి. దీంతో కరోనా ఎఫెక్ట్‌తో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 13వేల 49మంది మరణించారు. 3.7లక్షల మందికి కరోనా సోకిందని రిపోర్టులు చెబుతున్నాయి. 

See Also | కరోనాపై యుద్ధానికి ఈ పది రోజులే కీలకం.. ఎందుకంటే?