భారత్ లో క్రమంగా కనుమరుగవుతున్న కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : November 2, 2020 / 09:10 AM IST
భారత్ లో క్రమంగా కనుమరుగవుతున్న కరోనా

Updated On : November 2, 2020 / 10:39 AM IST

October Sees First Monthly Fall In India భారత్ లో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలతో పోలిస్తే అక్టోబర్‌ లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రోజుకు 50 వేలలోపే దేశంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ సమయంలో రోజూ రికార్డు స్థాయిలో 70వేలకు పైగా నమోదైన కేసులు నమోదైన విషయం తెలిసిందే.



అక్టోబర్-26-నవంబర్-1 మధ్యలో దాదాపు 3.2 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు వారంలో నమోదైన కేసుల సంఖ్య కంటే 42,738 తక్కువ.

కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 75లక్షలకు చేరుకోగా, యాక్టివ్‌ కేసులు 6లక్షల వరకు ఉన్నాయి. గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 6.97 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 91.54 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. ఇప్పటి వరకూ 11కోట్ల మందికిపైగా కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది



https://10tv.in/more-one-lakh-infants-died-from-air-pollution-in-india/
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలతో పోల్చితే గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనే వెల్లడైన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో జనం గుమిగూడినప్పుడు మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా వెలువడే తుంపర్లు సమీపంలో ఉన్న వారిని తొందరగా చేరుకుంటాయి. ఫలితంగా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి.



అయితే, ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు. ఇది కరోనా వైరస్‌ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్‌–19’అధ్యయనంలో వెల్లడైంది.



గాలి ద్వారా ‘ఏరోసోల్స్‌’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్‌ మోడల్‌ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమైన మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.