24గంటల్లో 7,466 కరోనా కేసులు.. దేశంలో తొలిసారి

  • Published By: vamsi ,Published On : May 29, 2020 / 04:21 AM IST
24గంటల్లో 7,466 కరోనా కేసులు.. దేశంలో తొలిసారి

Updated On : May 29, 2020 / 4:21 AM IST

భారతదేశంలో గత 24 గంటల్లో 7,466 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇన్ని ఎక్కువ కేసులు ఒకేరోజు నమోదవడం ఇదే తొలిసారి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1.65 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్ ఇదే. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 2,190కేసులు నమోదయ్యాయి.

COVID-19కు సంబంధించిన మరణాల సంఖ్య  4,706 చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 71,105 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 175 మరణాలు చోటుచేసుకోగా..  దేశంలో చికిత్స పొందుతున్న కరోనావైరస్ రోగుల సంఖ్య 89,987గా ఉంది. 

మహారాష్ట్ర తరువాత, తమిళనాడులో అత్యధిక కరోనావైరస్ కేసులు వచ్చాయి. తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 59 లక్షలకు పైగా ప్రజలకు కరోనా సోకగా.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా చనిపోయారు.

Read: COVID-19: SC చేతి వంట తినడానికి నిరాకరించిన బ్రాహ్మణులు