India Corona : కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.

India Corona : కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

India Corona

Updated On : June 27, 2021 / 10:38 AM IST

India Corona : దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి. అంతేకాదు కరోనా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ కావడం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 50వేల 040 కేసులు నమోదయ్యాయి. మరో 1,258 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 57వేల 944 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు.

ఇక రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,95,751గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,403కి తగ్గి.. ఆ రేటు 1.94 శాతానికి పడిపోయింది. నిన్న 17,77,309 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.