మాస్క్ వేసుకోలేదని మంత్రికి రూ.200 ఫైన్

ముఖ్యమంత్రి కార్యాలయం పరిసరాల్లో తిరిగే ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలని నిబంధన పెట్టారు. దానిని అతిక్రమించి తిరిగిన వ్యక్తికి గుజరాత్ ప్రభుత్వం రూ.200 ఫైన్ విధించింది. క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా గాంధీ నగర్ లో ఉన్న సీఎంఓకు మంత్రి మాస్క్ లేకుండా వచ్చాడు. ఇంట్లో నుంచి బయటికొస్తే మాస్క్ తప్పకుండా ధరించమని ప్రభుత్వం చెబుతుంటే పట్టించుకోనట్లు వ్యవహరించాడు మంత్రి.
కరోనా వ్యాప్తి కారణంగా వెయ్యి 534మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార పార్టీ మంత్రికి ఫైన్ వేసేవారు కాదు కాబోలు. ఈ లోకల్ న్యూస్ ఛానెల్స్ విడిచిపెట్టలేదు. రాష్ట్ర మంత్రి ఈశ్వరీసిన్హా పటేల్ మాస్క్ లేకుండానే ఆఫీస్ పరిసరాల్లో తిరుగుతున్నాడంటూ చూపెట్టేశాయి. ఈ క్యాబినెట్ మీటింగ్ కు హాజరైన మిగిలిన మంత్రులంతా మాస్క్ లు వేసుకుని దర్శనమిచ్చారు.
ఈ మంత్రి స్వతంత్ర్య హోదాలో క్రీడా యువజన, సాంస్కృతిక వ్యవహరాలా శాఖ మంత్రితో పాటు పోర్ట్ ఫోలియో సహకారుడిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. న్యూస్ ఛానెల్స్ పాయింట్ అవుట్ చేసి చూపించడంతో గుజరాత మునిసిపల్ కార్పొరేషన్ రియాక్ట్ అయింది. అతనికి రూ.200ఫైన్ వేస్తున్నట్లు వెల్లడించింది. క్యాబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత పటేల్ తాను కట్టిన రూ.200 చలానాను రిపోర్టర్లకు చూపించాడు.
‘నేను మాస్క్ వేసుకోనందుకు రూ.200 ఫైన్ కట్టాను. నేనెప్పుడూ మాస్క్ వేసుకుంటాను. కార్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రమే మర్చిపోయాను. తర్వాత నా తప్పేమిటో తెలిసింది’ అని పటేల్ మీడియాతో అన్నాడు.