మిడిల్ బెర్త్‌లు ఖాళీగా సిద్ధమవుతోన్న రైలు బుకింగ్‌లు!!

మిడిల్ బెర్త్‌లు ఖాళీగా సిద్ధమవుతోన్న రైలు బుకింగ్‌లు!!

Updated On : April 10, 2020 / 9:20 AM IST

మరి కొద్ది రోజుల్లో 21 రోజుల లాక్‌డౌన్ ముగియనుంది. స్తంభించిపోయిన సేవలు పునరుద్దరిస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో రవాణా సేవలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆంక్షలు వెలువడిన క్రమంలో సోషల్ డిస్టన్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రైల్వే మేనేజ్ మెంట్ మిడిల్ బెర్త్ ఖాళీగా ఉంచుతూ.. బుకింగ్ లు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. 

రైల్వే బోర్డ్ చీఫ్ వీకే యాదవ్.. రైల్వే అధికారులతో మీటింగ్ అయ్యారు. ప్రభుత్వం ఆలోచించన ప్లాన్లను వారు ముందుంచారు. రెడ్, ఎల్లో, గ్రీన్ మూడు కేటగిరీలు విభజించి సర్వీసులు మొదలుపెడతారు. ఎల్లో జోన్ అంటే షరతులతో కూడిన సర్వీసులు, గ్రీన్ అంటే ఎటువంటి కండిషన్లు ఉండవు. 

‘దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. చర్చలు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూనే ఉన్నాయి. రైలు సేవలు పునరుద్దరించాలని.. అది కూడా సామాజిక భద్రత పాటిస్తూనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మిడిల్ బెర్త అలాట్‌మెంట్ అనేది ఖాళీగానే ఉండనున్నట్లు చెబుతున్నారు. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టేంత వరకూ రైళ్లలో ఎటువంటి ఆహారపు అమ్మకాలు జరగకూడదని కండిషన్. 

షెడ్యూల్ ట్రైన్లను కాకుండా కేవలం ప్రత్యేకమైన రైళ్లనే నడపాలని అనుకుంటున్నారు. కరోనా వైరస్ ను రైళ్లలోకి చేరినివ్వకుండా ఎంట్రీ పాయింట్లలోనే థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారు. ఏ స్టేషన్లోనూ 60 మందికి మించి ప్రయాణికులు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరిగా ఉండాలి. 

రిజర్వేషన్ లేని ప్రయాణాన్ని తగ్గించాలనుకుంటున్నారు అధికారులు. దీని కారణంగా ఏ వ్యక్తికి వైరస్ ఉందో గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. ప్రధాన నగరాలైన కోల్ కతాను రెడ్ జోన్ గా ప్రకటించారు. ముంబై, సికింద్రాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో ఏప్రిల్ 30వరకూ ఒక్క రైలు కూడా ప్రయాణించే దాఖలాలు లేనట్లు కనిపిస్తుంది.