Covid-19 Update : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1247 మాత్రమే..!
India Covid-19 Update : దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకూ కరోనా తగ్గిపోయిందిలే అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోయాయి.

Covid 19 Update India Reports 1,247 Fresh Covid 19 Cases Today, 11,860 Active Cases In Last 24 Hours
India Covid-19 Update : దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకూ కరోనా తగ్గిపోయిందిలే అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోయాయి. నాల్గో వేవ్ అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల వ్యవధిలో దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ( ఏప్రిల్ 18) కన్నా మంగళవారం ( ఏప్రిల్ 19)న కరోనా కేసులు భారీగా తగ్గినట్టు అధికారులు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1247 కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 43 శాతం కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. సోమవారం కొత్తగా 2,183 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆదివారం కరోనా కేసుల సంఖ్య 1,150 నుంచి 89.8 శాతం పెరిగింది. అంతేకాకుండా, సోమవారం ఐదు రోజుల విరామం తర్వాత కేరళ రాష్ట్ర స్థాయి కోవిడ్ డేటాను నివేదించింది. డిసెంబర్ 19, 2020న కోటి మార్కును దాటింది. దేశం మే 4న రెండు కోట్ల కేసుల మైలురాయిని చేరింది. గత ఏడాదిలో జూన్ 23న మూడు కోట్లను దాటింది. దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీసింది. నిన్నటితో పోల్చుకుంటే 936 కేసులు తగ్గాయని, ఒకరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
India reports 1,247 new COVID19 cases today; Active caseload at 11,860 pic.twitter.com/iRrSTTNb6R
— ANI (@ANI) April 19, 2022
లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,45,527కి చేరింది. కరోనా ప్రారంభమైన అప్పటినుంచి దేశంలో మరణాల సంఖ్య 521966 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,860 (0.03 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. సోమవారం కరోనా నుంచి 928 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,11,701 కి చేరింది. ఇక కరోనా రికవరీ రేటు 98.76 శాతం ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,86,72,15,865 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. 16,89,995 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో నిన్న ఒక్కరోజునే 4,01,909 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి 83.25 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Read Also : Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..