Covid 4th Wave : బాంబు పేల్చిన సైంటిస్టులు.. కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ !

నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి...

Covid 4th Wave : బాంబు పేల్చిన సైంటిస్టులు.. కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ !

Covid 19 India

Updated On : February 27, 2022 / 5:48 PM IST

Covid IIT-K Experts Predict 4th Wave : థర్డ్‌వేవ్‌ ముగిసింది..! ఫోర్త్‌వేవ్‌ ఎంట్రీ ఇవ్వనుంది..! అవును..! భారత్‌లో కరోనా ఫోర్త్‌వేవ్‌కు ముహూర్తం ఫిక్స్‌ అయింది. సెకండ్‌వేవ్‌ నుంచి థర్డ్‌వేవ్‌కు దాదాపు 6 నెలల గ్యాప్‌ తీసుకున్న కరోనా.. ఈ సారి మాత్రం 4 నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనుంది. కరోనా పీడ వదిలిపోయిందని అనుకునేలోపే సైంటిస్టులు వైరస్‌ బాంబు పేల్చారు. నాలుగోవేవ్‌కు నాలుగు నెలలే సమయముందని తేల్చిచెప్పారు. వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ మొదలవుతుందని.. అది అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. కొద్ది రోజులుగా రోజువారి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కోవిడ్ మూడో దశ దాదాపు ముగిసినట్లే. అయితే కరోనా నాలుగో దశ జూన్ 22 నాటికి ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు.

Read More : Plant Based Covid Vaccine : మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం..త్వరలోనే అందుబాటులోకి

అయితే నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు పరిశోధకులు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్‌ సైంటిస్టులు మాత్రమే.

Read More : Shruthi Haasan : శృతి హాసన్‌కి కరోనా పాజిటివ్

మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో 2022, ఫిబ్రవరి 26వ తేదీ శనివారం కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు, దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 5,13,724కి చేరింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.54 శాతానికి మెరుగు పడింది.