లేహ్ లో 17వరకు కర్ఫ్యూ పొడిగింపు

కరోనా కట్టడి కోసం లడఖ్ లో విధించిన కర్ఫ్యూ పొడిగించడింది.

లేహ్ లో 17వరకు కర్ఫ్యూ పొడిగింపు

Leh

Updated On : May 14, 2021 / 11:49 AM IST

Leh :కరోనా కట్టడి కోసం లడఖ్ లో విధించిన కర్ఫ్యూ పొడిగించడింది. గత నెల 29న విధించిన కర్ఫ్యూ గడువు సోమవారంతో ముగుస్తున్న నేపథ్యంలో మే-17వరకు కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు లడఖ్ పాలకయంత్రాంగం ఇవాళ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని లేహ్ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(DDMA)చైర్మన్ శ్రీకాంత్ సూశీ తెలిపారు.

కర్ఫ్యూ సమయంలో ప్రతి రోజూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంటల వరకు నిత్యావసర వస్తువుల షాపులు(మాంసం దుకాణాలు,డైరీ ప్రొడక్ట్స్ షాపులు,కూరగాయల షాపులు,బేకరీలు)తెరిచేందుకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. దూర ప్రాంతంలో నివసించేవారికి నిత్యావసరాల సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని తెలిపారు. అయితే అత్యవసరాల అవసరం ఉన్నవారికి వాహనాల రాకపోకలకు సంబంధించి పాస్ లు జారీ చేస్తామన్నారు.