CoWIN data breach: మరోసారి డేటా లీక్ కలకలం… స్పందించిన భారత ప్రభుత్వం

ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.

CoWIN data breach: మరోసారి డేటా లీక్ కలకలం… స్పందించిన భారత ప్రభుత్వం

CoWIN data breach

Updated On : June 12, 2023 / 5:16 PM IST

CoWIN data breach: దేశంలో మరోసారి డేటా లీక్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొవిన్ పోర్టల్ (Co-WIN portal) ద్వారా ప్రజల డేటా లీకైందని పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం (Government of India) స్పందించింది.

” కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ డేటా గోప్యత విషయంలో పూర్తిగా సురక్షితం. వివరాలు లీక్ అయ్యాయంటూ వస్తున్నదంతా నిరాధార ప్రచారమే. ఈ విషయంలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది ” అని భారత ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది. కరోనా టీకా వేయించుకున్న పౌరుల వ్యక్తిగత వివరాలు కొవిన్ యాప్/పోర్టల్ నుంచి లీక్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పౌరుల మొబైల్, ఆధార్, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వంటివి లీక్ అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు.

People Data Leak : కోవిన్ పోర్టల్ ద్వారా ప్రజల డేటా లీక్.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరో కీలక ఆరోపణ