Cow Dung: ఆవు పేడ, మూత్రం లాభాల గురించి రైతులకు తెలియజెప్పాలి – సీఎం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవు పేడ, మూత్రం గురించి తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టారు. ఆవు పేడ, వాటి మూత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని..

Cow Dung
Cow Dung: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవు పేడ, మూత్రం గురించి తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టారు. ఆవు పేడ, వాటి మూత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని.. తద్వారా దేశం బాగుపడుతుందని అన్నారు.
‘ఆవు పేడ, మూత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి.. దేశంలో సరైన వ్యవస్థగా ఆవు వ్యర్థాలను వాడుకోగలిగితే.. ఆర్థికంగా మరింత ఎదగొచ్చని అన్నారు. ఏదో ఒకరోజు ఈ విషయంలో సక్సెస్ అవుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు చెప్పారు’ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
శక్తి 2021 అనే ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ కన్వెన్షన్ లో మాట్లాడిన ఆయన.. ఆవు వ్యర్థాల గురించి చాలా విషయాలు ప్రసంగించారు. స్మశాన వాటికల్లో చాలా మంది కట్టెలకు బదులుగా ఆవు పేడను పిడకలుగా వాడుతున్నారు.
………………………………….. : మరో కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా
ప్రభుత్వం ఆవుల కోసం నివాసాలను ఏర్పాటు చేస్తుంది. ఇది సమాజం కూడా సహకరిస్తేనే సాధ్యమవుతుంది. వెటర్నరీ డాక్టర్లు, నిపుణులు ఆవు ద్వారా వచ్చే ఆదాయం గురించి సన్నకారు రైతులకు, ఆవులను సంరక్షించే వారికి తెలియజేయాలని అన్నారు.
మహిళలు ఈ ఫీల్డ్ లో రాణించేందుకు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా వెల్లడించారు.