CPI Narayana : బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా కొత్త జాతీయ పార్టీ ఉండాలి : సీపీఐ నేత నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్‌ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరమని అభిప్రాయపడ్డారు.

CPI Narayana : బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా కొత్త జాతీయ పార్టీ ఉండాలి : సీపీఐ నేత నారాయణ

CPI Narayana

Updated On : September 30, 2022 / 12:27 AM IST

CPI Narayana : టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్‌ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌తో సహా అన్ని జాతీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇందుకు కేసీఆర్‌ కూడా ముందుకు రావడం సమర్థనీయమని నారాయణ అన్నారు. కేసీఆర్‌ ప్రకటించబోయే జాతీయ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పడాల్సి ఉందని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి బలపడే విధంగా టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ అడుగులు వేస్తే మంచిదన్నారు. కేసీఆర్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తుందని చెప్పారు.