Madurai : కరోనా వేళ, 5 పైసలకే బిర్యానీ..తర్వాత

కేవలం ఐదు పైసలకే బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు 5 పైసలు ఎవరి దగ్గర ఉంటాయోనని అనుకున్నారు హోటల్ నిర్వాహకులు. కానీ...ప్రకటించిన తర్వాత చేతిలో 5 పైసలు పట్టుకుని హోటల్ ముందు క్యూ కట్టారు.

Madurai : కరోనా వేళ, 5 పైసలకే బిర్యానీ..తర్వాత

Biryani

Updated On : July 21, 2021 / 9:20 PM IST

Biryani For ‘5 Paise’ : కరోనా వేళ..అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నా..డోంట్ కేర్ అంటున్నారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ప్రచారం చేసేందుకు..వినూత్నమార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని, మొదటిగా వచ్చే కస్టమర్లకు ఉచితంగా అందిస్తామని..ఇలా ఏదో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఇలాగే..ఓ హోటల్ యాజమాన్యం వ్యవహరించింది. కేవలం ఐదు పైసలకే బిర్యానీ అందిస్తామని ప్రకటించింది.

Read More : GHMC : కౌశిక్ రెడ్డికి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ

ఇప్పుడు 5 పైసలు ఎవరి దగ్గర ఉంటాయోనని అనుకున్నారు హోటల్ నిర్వాహకులు. కానీ…ప్రకటించిన తర్వాత చేతిలో 5 పైసలు పట్టుకుని హోటల్ ముందు క్యూ కట్టారు. వీరిని చూసిన యాజమాన్యం నోరెళ్లబెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధురై జిల్లా సెల్లూర్ లో సుకన బిర్యానీ హోటల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా…5 పైసల నాణెం తీసుకొస్తే..బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. అనూహ్య రీతిలో స్పందన వచ్చింది.

Read More : Telangana : 24 గంటల్లో 691 కరోనా కేసులు, 05 మంది మృతి

చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా.. క్యూ కట్టారు. అందరూ ఎగబడడంతో వారి తాకిడిని తట్టుకోలేకపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే..కరోనా సెకండ్ వేవ్ ఉన్న సమయాన్ని కూడా మరిచిపోయారు. కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. చివరకు తట్టుకోలేక..హోటల్ షట్టర్లు దింపేసింది. మరి..పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.