ప్రతీకారం తీర్చుకోవాల్సిందే : ఉగ్రదాడిపై రగిలిపోతున్న దేశ ప్రజలు

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 05:24 PM IST
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే : ఉగ్రదాడిపై రగిలిపోతున్న దేశ ప్రజలు

Updated On : February 14, 2019 / 5:24 PM IST

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో ఇది అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. దాడులకు పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది.

 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా అవంతిపొర సమీపంలోని గోరాపోరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం ఓ ఉగ్రవాది 350 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియోతో.. సీఆర్పీఎఫ్‌ బస్సును ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ముక్కలైంది. తెగిపడిన శరీర అవయవాలతో రహదారి రక్తమోడింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

జమ్ము నుంచి శ్రీనగర్‌కు 70 వాహనాల్లో 2వేల 500 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తుండగా టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. ప్రధాన రహదారిపై ఓ ఆటోరిక్షాలో ఐఈడీని ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ అక్కడికి రాగానే అందులో ఓ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేశారు. కారు బాంబుతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులు జరపడం 1990 తర్వాత ఇదే మొదటిసారి.

 

సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై తామే దాడి చేసినట్లు జైషే ఈ మహ్మద్‌ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామాలో కాకపోరా ప్రాంతానికి చెందిన అదిల్‌ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సిఆర్‌పిఎఫ్‌ అధికారులతో మాట్లాడారు. పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నారు. ఉగ్రదాడితో కశ్మీర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. CRPFకి చెందిన కంపెనీలను అవంతిపొరాకు పంపారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. దొంగ దెబ్బకొట్టిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాల్సిందేనని, ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి.