ఇండియావైపు దూసుకొస్తున్న పబక్ తుఫాన్

  • Published By: venkaiahnaidu ,Published On : January 5, 2019 / 08:06 AM IST
ఇండియావైపు దూసుకొస్తున్న పబక్ తుఫాన్

Updated On : January 5, 2019 / 8:06 AM IST

అండయాన్ నికోబార్ దీవులవైపుకి పబక్ తుఫాను వేగంగా దూసుకొస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే “ఎల్లో”అలర్ట్ ప్రకటించినట్లు శనివారం(జనవరి5,2019) కేంద్రహోంమంత్రిత్వ శాఖ తెలిపింది. పబక్ కారణంగా అండమాన్ దీవుల్లో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. జనవరి 7వరకు బెంగాల్ తీర ప్రాంతాల్లో కూడా సముద్రం అల్లకల్లోంలంగా మారే పరిస్థితి ఉందని వాతావరణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

థాయ్ లాండ్ లో ఉద్భవించిన పబక్ దాని చుట్టుపక్కల దీవుల్లో నాలుగు రోజులుగా భీభత్సం సృష్టిస్తోంది. అండమాన్ ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎవ్వరూ సముద్రంలోకి వేట వెళ్లకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. జనవరి 6 అర్థరాత్రి పబక్ 90కిలోమీటర్ల వేగంతో అండమాన్ క్రాస్ అయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ మయన్మార్ లో పబక్ తీవ్రప్రభావం చూపే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.