బోరు పంపును ఉపయోగించాడని దళితుడిని కొట్టారు

బోరు పంపును ఉపయోగించాడని దళితుడిని కొట్టారు

Updated On : December 25, 2020 / 7:46 PM IST

Dalit man beaten up : భారతదేశంలో దళితులపట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. షేవింగ్ చేశాడని, తమ గ్రామంలోకి ప్రవేశించాడని, నీటిని ఉపయోగించాడని ఇతరత్రా కారణాలతో దళితులపై దాడులు, హత్యలు, బహిష్కరణ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోరు పంపును (handpump) ఉపయోగించాడనే కారణంతో దళితుడి (Dalit man) పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం (Uttar Pradesh)లో చోటు చేసుకుంది.

బండా జిల్లా (Banda district)లోని ఓ గ్రామంలో 45 ఏళ్ల దళితుడిని దారుణంగా కొట్టారు. హ్యాండ్ పంపును ఉపయోగించడమే అతను చేసిన నేరం. Tendura గ్రామంలో…హ్యాండ్ పంపు నుంచి నీటిని తీసుకోవడానికి వెళ్లినప్పుడు..రామ్ దయాల్ యాదవ్ కుటుంబసభ్యులు తనపై కర్రలతో దాడి చేశారంటూ..రామ్ చంద్ర రైదాస్ ఆరోపించారు. ఈ మేరకు Bisanda police station‌ లో ఫిర్యాదు చేయడంతో FIR నమోదు చేసినట్లు Station House Officer Narendra Pratap Singh తెలిపారు.

గాయాలతో ఉన్న రైదాస్‌ను ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు (primary health centre) తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. యాదవులు నివాసం ఉండే..ప్రాంతంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ పంపు నుంచి నీరు తీసుకోకుండా..తమపై నిషేధం విధించారని రైదాస్ తెలిపాడని, Atarra sub-divisional magistrate సహకారంతో ఈ విషయాన్ని పరిష్కరించడం జరిగిందని SHO వెల్లడించారు.