Dalit Youth Kill : లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోలేదని.. దళిత యువకుడి హత్య, తల్లిని వివస్త్రను చేసి దాడి
విక్రమ్ సింగ్.. కొంతమందితో కలిసి నితిన్ అహిర్వార్ అనే దళిత యువకుడి ఇంట్లోకి చొరబడ్డారు. 2019లో అహిర్వార్ సోదరి తమపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు.

Dalit youth beaten to death
Dalit Youth Kill In Madhya Pradesh మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోలేదని దళిత యువకుడిని దుండగులు కొట్టి చంపారు. 20 ఏళ్ల దళిత యువకుడిని కొంతమంది దుండగులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి చంపారు. వారిని అడ్డుకోబోయిన బాధితుడి తల్లిని వివస్త్రను చేసి దాడి చేశారు. అంతటితో ఆగకుండా బాధితుల ఇంటిని సైతం ధ్వంసం చేశారు.
సాగర్ జిల్లాలోని బరోడియా నౌంగర్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గురువారం రాత్రి విక్రమ్ సింగ్.. కొంతమందితో కలిసి నితిన్ అహిర్వార్ అనే దళిత యువకుడి ఇంట్లోకి చొరబడ్డారు. 2019లో అహిర్వార్ సోదరి తమపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు.
నితిన్ అహిర్వార్ ఒప్పుకోకపోవడంతో కొంతమందితో కలిసి విక్రమ్ సింగ్ బాధితుడిపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు. దుండగులను అడ్డుకోబోయిన తల్లిపై అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రను చేసి ఆమె పైనా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సాగర్ జిల్లా పోలీసుల వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.