మంజూరి చతుర్వేది నృత్యాన్ని మధ్యలో ఆపేశారు

లక్నోలో యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంజూరి చతుర్వేది సూఫీ – కథక్ ప్రదర్శించారు. అయితే..మధ్యలోనే ప్రదర్శనను ఆపేయాల్సి వచ్చింది. దీనికి కారణం కవ్వాలి అని పేర్కొనడమే. చతుర్వేది సొంత గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక్కడ ప్రదర్శన ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ఆహ్వానించింది. ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా సంగీతాన్ని ఆపివేశారు.
ఏమి జరిగిందోనని చతుర్వేది ఆశ్చర్యపోయారు. టెక్నికల్ ఇష్యూ అని తొలుత అనుకున్నట్లు, కానీ తర్వాత తెలిసింది..‘కవ్వాలి..నహీ చలేగి యాహ’ అంటూ చెప్పారని చతుర్వేది వెల్లడించారు. ప్రదర్శన 45 నిమిషాల పాటు ఇవ్వాల్సి ఉందని, కానీ తన సొంత గ్రామంలో ఇలా జరగడం షాకకు గురవుతున్నట్లు తెలిపారు.
దీనిపై యూపీ ప్రభుత్వం స్పందించింది. నిర్వాహకులు, ప్రదర్శన ఇస్తున్న కళాకారిణి పట్ల ఏదైనా ఇష్యూ జరిగి ఉండవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రదర్శన చాలా ఆలస్యంగా ఆరంభమైందని తెలిపారు.
చతుర్వేది ప్రసిద్ధ నర్తకి అనే విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల్లో 300కి పైగా కచేరీల ద్వారా ప్రదర్వనలు ఇచ్చారు. యూపీ సంగీత నాటక్ అకాడమీ ఆధ్వర్యంలో కథక్ కేంద్రంలో శిక్షణ పొందారు. చతుర్వేది తాత జస్టిస్ హరిశంకర్ అలహాబాద్ హైకోర్టులోని లంచ్ బెంచ్ వద్ద హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా, తండ్రి ఐఐటీ రూర్కీలో జియో ఫిజిక్స్ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నారు.
Read More : సీఎం ఉద్దవ్ వ్యాఖ్యలు : సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఫైర్..షిర్డీ ఆలయాన్ని మూసివేస్తాం