పాకిస్తాన్ పౌరసత్వం ఇవ్వాలంటున్న డారెన్ సామీ

వెస్టిండీస్ ఆల్ రౌండర్..డారెన్ సామీ..పాకిస్తాన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడంట. అన్నీ అనుకూలిస్తే..త్వరలోనే పాక్ పౌరునిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విండీస్ బోర్డుతో ఇతనికి విబేధాలున్నాయి. దీంతో విదేశీ లీగ్‌ల్లో బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ప్రధానంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు ఈ బ్యాట్ మెన్. పెషావర్ జెల్మీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
సామీ బ్యాటింగ్ విన్యాసాలకు పాక్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సామీ..తమ దేశం తరపున ఆడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తును పెషావర్ జల్మీ యజమాని ఆఫ్రిది..పరిశీలనకు పంపించాడు. 2004లో వెస్టిండీస్ జట్టు తరపున సామి మైదానంలో అడుగుపెట్టాడు. జట్టుకు ఎన్నో చిరస్మరణయమైన విజయాలు అందిచడంలో కీలక పాత్ర పోషించాడు. 2016లో సామి..కెప్టెన్సీ వ్యవహరించాడు.
ఇతని సారథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. విండీస్ తరపున 38 టెస్టులు, 126 వన్డేల్లో, 68 టీ 20లో ప్రాతినిధ్యం వహించాడు. 2017 సెప్టెంబర్‌లో చివరి టీ 20 మ్యాచ్ ఆడాడు.
పాక్ దేశం..‘నిషాన్ ఏ పాకిస్థాన్’ అత్యుత్తమ పౌర పురస్కారాన్ని సామీకి ఇవ్వనుంది. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆలీ చేతుల మీదుగా సామీ ఈ అవార్డును అందుకోనున్నారు. పెషావర్ జాల్మీ ఫ్రాంచైజీ యజమాని జావెద్ ఆఫ్రీది ఇటీవలే..ఈ పురస్కారం ఇవ్వాలని దేశ అధ్యక్షుడు, పీసీబీ ఛైర్మన్‌ను కోరారు. దీంతో వారు అంగీకరించడంతో..మార్చి 23వ తేదీన సామీ పురస్కారాన్ని అందుకోనున్నారు.
Read More>> మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్