మమత ఆదేశమే : కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్ బదిలీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 19, 2019 / 03:02 PM IST
మమత ఆదేశమే : కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్ బదిలీ

కోల్ కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్ కు సీఐడీ విభాగంలో ఏడీజీ&ఐజీపీగా పోస్టింగ్ ఇచ్చారు. 1991 బ్యాచ్ కి చెందిన అనూజ్ కోల్ కతా పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టారు.

శారదా చిట్ ఫండ్ స్కామ్ దర్యాప్తు విషయంలో ఇటీవల మమత ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య జరిగిన ఘర్ణణలో కేంద్రబిందువైన రాజీవ్ కుమార్ పై ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజీవ్ ని బదిలీ చేయాల్సిందిగా మమత సర్కార్ ని ఈసీ ఆదేశించింది.  ఎన్నికలు పూర్తయితే మళ్లీ రాజీవ్ కుమార్ ఆ స్థానంలో కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2016 మే నెలలో కోల్ కతా పోలీస్ కమిషనర్ గా చేపట్టారు రాజీవ్ కుమార్.

శారదాచిట్ ఫండ్ స్కామ్ విచారణకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందానికి నేతృత్వం వహించిన రాజీవ్ కుమార్..సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల ఆయనను విచారించేందుకు కోల్ కతాలోని ఆయన నివాసానికి  సీబీఐ అధికారుల రావడంతో వారిని వెస్ట్ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలిపెట్టిన విషయం తెలిసిందే. రాజీవ్ కుమార్ కు మద్దతుగా సీబీఐ తీరుపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నడిరోడ్డుపై దీక్షకు దిగిన విషయం తెలిసిందే.