IT Act Section 67: సోషల్ మీడియా యూజర్లూ జాగ్రత్త.. ఆ పొరపాటు జరిగే నేరుగా జైలుకే
అభ్యంతరకర వీడియో కానీ, పోస్ట్ కానీ కనిపించినట్లైతే మీ సమీప పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖలో ప్రత్యేక సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశాయి.

Social Media: సోషల్ మీడియాలో వీడియోలను రూపొందించడం, వాటిని వైరల్ చేయడం అనేది ప్రజల్లో క్రేజ్ బాగా పెరిగింది. నేటి కాలంలో ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. కొన్నిసార్లు ఉద్రిక్తతలకు కారణమయ్యే వీడియోలు కూడా షేర్ అవుతుంటాయి. వీటి వల్ల హింస, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి వీడియోలు ఇక పైనుంచి షేర్ చేయడం కుదరదు. వీడియోనే కాదు, అలాంటి పోస్టులు కూడా వేయకూడదు. ఎందుకంటే, మీరు ఏదైనా అభ్యంతరకరమైన వీడియో లేదా పోస్ట్‌ను షేర్ చేస్తే, మీకు జరిమానా మాత్రమే కాకుండా జైలుకు కూడా వెళ్లవలసి ఉంటుంది.
పోస్టు ముందు ఏం చేయాలి?
మీ ప్రొఫైల్ నుంచి వీడియోను షేర్ చేయడానికి ముందు, మీరు ఆ వీడియోలోని కంటెంట్‌ను స్వయంగా తనిఖీ చేయాలి. అలాగే వీడియో సోర్సును, దానిలో అందించిన సమాచారాన్ని ధృవీకరించాలి. ఈ విషయాలన్నీ ప్రతికూలంగా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటిని మీ ప్రొఫైల్‌లో షేర్ చేయకపోవడమే మంచింది.
ఎలాంటి శిక్ష ఉంటుంది?
ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం ఎవరైనా సోషల్ మీడియాలో మొదటిసారి ఇలా చేసినందుకు దోషిగా తేలితే మూడేళ్లు జైలు శిక్ష విధించవచ్చు. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు, ఇలాంటి నేరం మళ్లీ పునరావృతమైతే 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా ఫిర్యాదు చేయాలి?
అభ్యంతరకర వీడియో కానీ, పోస్ట్ కానీ కనిపించినట్లైతే మీ సమీప పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖలో ప్రత్యేక సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశాయి. అక్కడ కూడా రాతపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.