ఊపిరి పీల్చుకుంటున్న ఢిల్లీ : తగ్గుతున్న కాలుష్యం 

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 04:49 AM IST
ఊపిరి పీల్చుకుంటున్న ఢిల్లీ : తగ్గుతున్న కాలుష్యం 

Updated On : November 7, 2019 / 4:49 AM IST

వాయు కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది.  దీపావళి పండగ తరువాత గణనీయంగా పెరిగిన న్యూఢిల్లీ కాలుష్యం ఇప్పుడు కాస్తంత తగ్గింది. రోజు రోజుకు గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం..కాలుష్య తీవ్రత గత నాలుగు రోజుల క్రితం 1000 పాయింట్లు దాటింది. రెండు రోజుల క్రితం 279  తగ్గింది. అనంతరం బుధవారం నాటికి ఇది 413 పాయింట్లకు తగ్గింది. ఇలా తగ్గుతూ.. పీఎం 2.5పై 235 పాయింట్లుగా కాలుష్య తీవ్రత నమోదైంది. వాతావరణంలో మార్పు, గాలి వేగం అధికంగా ఉండటంతో గాలిలో కాలుష్యం తగ్గుతోంది. 

కాలుష్యం తగ్గటంతో స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్దులంతా ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించి దీపావళి పండుగ అనంతరం బుధవారం నాటి నుంచి స్కూళ్లకు వెళుతున్నారు. కాలుష్యం తగ్గినా శీతాకాలం వల్ల ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

కాగా వాయి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు పొరుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది. రైతులు పంటల వ్యర్థాలు తగుల బట్టటంతో ఆ కాలుష్యం ఢిల్లీకి వ్యాపించి సమస్యగా తయారవుతోందని..దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖల్లో పేర్కొంది. ఈ క్రమంలో పంజాబ్..హర్యానా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. దీంట్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం పంటల వ్యర్థాలను తగుల బెట్టకూడదంటూ రైతులకు నిబంధనలతో కూడిన సూచనలు జారీ చేసింది. వీటిని అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో వ్యర్థాలు తగుల బెట్టిన 22మంది రైతులను అరెస్ట్ చేసింది. 45మందిపై ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసింది.