Deepinder Goyal : జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్‌లో కీలక పరిణామం.. సీఈఓ పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా.. ఏం జరిగిందంటే?
Deepinder Goyal : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా చేశారు.
Deepinder Goyal
Deepinder Goyal : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం బ్లింకిట్ సీఈవోగా ఉన్న అల్బీందర్ దిండ్సా ఎటెర్నల్ సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచే ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది.
Also Read : ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. మీరు ఈ రకంగా విత్తనాలు వేస్తే రేపు వృక్షాలవుతాయ్.. వైఎస్ జగన్ హెచ్చరిక
తన రాజీనామాకు సంబంధించి వాటాదారులకు దీపిందర్ గోయల్ లేఖ రాశారు. ఈరోజు నేను గ్రూప్ సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నాను. షేర్ హోల్డర్స్ ఆమోదానికి లోబడి వైస్ చైర్మన్‌గా, డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతాను. అల్బిందర్ దిండ్సా ఎటర్నల్ కొత్త గ్రూప్ సీఈవోగా పనిచేస్తారని దీపిందర్ గోయల్ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కొత్త ఆలోచనలు వచ్చాయి. అయితే, అవి హై రిస్కుతో కూడుకున్నవి. పూర్తి ప్రయోగాత్మకమైనవి. కాబట్టి ఎటెర్నల్ వంటి లిస్టెండ్ కంపెనీలో ఉంటూ ఇలాంటివి చేయడం కష్టం. అందుకే సీఈవోగా వైదొలుగుతున్నా అంటూ దీపిందర్ గోయల్ పేర్కొన్నారు.
రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణ ప్రాథమ్యాలు, వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలూ అల్బీందర్ గోయల్ తీసుకుంటారని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. బ్లింకిట్‌ను బ్రేక్ ఈవెన్ సాధించడంలో సమర్థవంతమైన పాత్ర పోషించిన ఆయన ఎటెర్నల్ గ్రూప్‌ను నడిపించగలరన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
దీపిందర్ గోయల్ ఐఐటీ గ్రాడ్యుయేట్ నుండి ఇండియాలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. 2008లో “Foodiebay” పేరుతో ప్రయాణమైన ప్రారంభం Zomato గా మారింది. కొన్నేళ్ళ క్రితం బ్లింకిట్‌ను కొనుగోలుచేసి క్విక్ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీగా నిలిచారు. వ్యాపారాలన్నింటిని కలిపి “ఎటర్నల్” సంస్థను ఏర్పరిచాడు.
