ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. మీరు ఈ రకంగా విత్తనాలు వేస్తే రేపు వృక్షాలవుతాయ్.. వైఎస్ జగన్ హెచ్చరిక
Ys Jagan : రెడ్‌బుక్ రాజ్యాంగంలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి గ్రామ పరిస్థితి ఉదాహరణ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Ys Jagan
Ys Jagan : రెడ్‌బుక్ రాజ్యాంగంలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి గ్రామ పరిస్థితి ఉదాహరణ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఊర్లు విడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పెద్దలే ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తుంటే ఇంకేమనాలి..? ఊర్లోకి వెళ్లడానికి అనుమతికోసం హైకోర్టుకి వెళ్లాల్సిన దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఊర్లో భార్య అనారోగ్యంతో ఉంటే చూడటానికి వెళ్లిన దళితుడు సాల్మాన్ ను దారుణంగా కొట్టి చంపేశారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయనీయకుండా సాక్షాత్తూ పోలీసులు అడ్డుకోవడం ఏంటి అంటూ జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ తప్పుడు సంప్రదాయాలు.. ఇలాంటి విత్తనాలు రేపు చెట్లు అవుతాయంటూ జగన్ హెచ్చరించారు.
బాధ కలిగిన ఆ కుటుంబాలు రేపు ఊరుకుంటాయా..? ఎవరు కంట్రోల్ చెయ్యలేని పరిస్థితికి వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తాం. కోర్టుల అనుమతితో ఊర్లోకి పున:ప్రవేశం చేస్తాం. ఎల్లంకాలం చంద్రబాబు పాలన ఉండదు. రెండేళ్లు అయిపోయింది.. మరో మూడేళ్లు అయిపోతుంది. పిన్నెల్లి ఘటనలో సీఐ, ఎస్ఐలు, ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా దోషే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు. ఇది ఆయన గుర్తిస్తే మంచిది అంటూ జగన్ హెచ్చరించారు.
సంక్రాంతికి పబ్లిక్ గా గ్యాంబ్లింగ్ నడిపారు. ప్రతీ నియోజకవర్గంలో వాటాలు పంచుకుని గ్యాంబ్లింగ్ జరిపారు. ఎమ్మెల్యే, సీఎం, డీజీపీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ ఇలా అందరూ వాటాలు పంచుకున్నారు. 2వేల కోట్లు గ్యాంబ్లింగ్ జరిగింది. ఇదంతా ప్రజలను లూటీ చెయ్యడం కాదా? అంటూ జగన్ ప్రశ్నించారు.
