ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం..నేటితో ముగియనున్న సరి-బేసి విధానం

దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీలో హెల్త్ ఎమర్జన్సీ కొనసాగుతున్నప్పటికీ సరి-బేసి విధానాన్ని పొడిగించే విషయంలో కేజ్రీవాల్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 4నుంచి ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నేటితో ఢిల్లీలో సరి-బేసి విధానం ముగుస్తుంది.
మరోవైపు ఈ రోజు నుండి బలమైన గాలులు వస్తాయని భారత వాతావరణశాఖ విభాగం అంచనా వేసింది, ఇది వాయు కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 16 (శనివారం) నాటికి గాలి నాణ్యత పరిస్థితి స్వల్పంగా మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రమాదకర గాలి నాణ్యతను దృష్ట్యా పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (EPCA) పాఠశాలలను మూసివేయాలని సిఫారసు చేసింది.
ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను కనుగొనడానికి హైడ్రోజన్ ఆధారిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
Delhi: Major pollutant PM 2.5 at 489 (severe category), at ITO, according to Central Pollution Control Board pic.twitter.com/LsjnrAOtP5
— ANI (@ANI) 15 November 2019