CM Arvind Kejriwal: గుజరాత్‌లో ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బీజేపీ భయపడుతుంది.. అందుకే ఆప్ ఎమ్మెల్యే అరెస్టు..

ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా‌ఖాన్‌ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా అరెస్టును తీవ్రంగా ఖండించారు.

CM Arvind Kejriwal: గుజరాత్‌లో ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బీజేపీ భయపడుతుంది.. అందుకే ఆప్ ఎమ్మెల్యే అరెస్టు..

Delhi Chief Minister Arvind Kejriwal

Updated On : September 17, 2022 / 5:14 PM IST

Delhi CM Arvind Kejriwal: ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా‌ఖాన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా అరెస్టును తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు సంస్థలు “బీజేపీ కోసం బ్యాటింగ్ చేస్తున్నాయి” అంటూ విమర్శించారు. గుజరాత్‌లో ఆప్‌కు “పెరుగుతున్న ప్రజాదరణ” నేపధ్యంలోనే ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేశారని, పార్టీ మద్దతు ఎమ్మెల్యేకు ఉంటుందని అన్నారు. వారు.. అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేయడంతోనే ఆగరని, రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో బీజేపీ దెబ్బతింటుందని వారికి తెలుసుని, అందుకే వారు ఈ అరెస్టు పర్వాన్ని కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

AAP MLA arrested : వక్ఫ్‌ బోర్డు నియామకాల్లో అక్రమాలు .. ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను తొలుత అరెస్టు చేశారు. కానీ, వారు కోర్టులో ఎటువంటి సాక్ష్యాలను సమర్పించలేకపోయారు. మళ్లీ మనీష్ సిసోడియా ఇంటిపై ఈడీ దాడులు చేయించారు. కానీ ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాను అరెస్టు చేశారు. ఇంకా చాలామంది ఆప్ ఎమ్మెల్యేలను రాబోయేకాలంలో అరెస్టు చేస్తారు అటూ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో ఆప్‌కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందనే భయంతోనే వారు ఇలా ప్రవర్తిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ అరెస్టులు చేయిస్తున్నారని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆప్‌ని విచ్ఛిన్నం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ లోటస్‌లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఆప్‌లోని ప్రతి నాయకుడిని ఇబ్బందులు పెట్టేలా ఆపరేషన్ లోటస్ కొనసాగుతోంధని సిసోడియా ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ ఏసీబీ అరెస్టు చేసినట్లు ఏసీబీ అధిపతి మధుర్ వర్మ శుక్రవారం తెలిపారు. ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్‌పర్సన్ గా ఉన్నారు. మాజీ వక్ఫ్ బోర్డు సభ్యుని ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద 2020 జనవరి 28న ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో 33 మంది సిబ్బందిని అక్రమంగా రిక్రూట్‌మెంట్ చేశారని, రికార్డుల ఆర్థిక తారుమారు, వాహనాల కొనుగోలులో అవినీతి వంటి ఆరోపణలతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేశారు.