దోస్త్ మేరా దోస్త్ : అమరావతికి కేజ్రీవాల్

  • Published By: madhu ,Published On : February 18, 2019 / 10:49 AM IST
దోస్త్ మేరా దోస్త్ : అమరావతికి కేజ్రీవాల్

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్…ఏపీ సీఎం కేజ్రీవాల్ మధ్య దోస్తీ మరింత ఎక్కువవుతోంది. ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. కలిసి ముందుకు వెళ్లాలని..పరస్పరం సహకరించుకోవాలని అనుకుంటున్నారు. బాబు దీక్ష చేస్తే కేజ్రీ వెళ్లడం..కేజ్రీ దీక్ష చేస్తే బాబు వెళ్లడం జరిగాయి. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై బాబు చురుకుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా పలు జాతీయ పార్టీలను ఏకం చేసే పని పెట్టుకున్నారు. 

ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం కేజ్రీ పాండిచ్చేరికి వెళ్లారు. కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పాండిచ్చేరి సీఎంను పరమార్శించేందుకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు కేజ్రీవాల్. ఇక్కడి నుండి గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న అనంతరం నేరుగా విజయవాడ హోటల్‌లో బస చేయనున్నారు. గుంటూరు టూర్ ముగించుకుని విజయవాడకు బాబు చేరుకోనున్నారు. అనంతరం రాత్రి 8.30గంటల ప్రాంతంలో వీరిద్దరి భేటీ జరుగనుంది. బీజేపీయేతర కూటమిపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. కాంగ్రెస్ – ఆప్ మధ్య విబేధాలు..ఇతరత్రా వాటిపై సుదీర్ఘంగా సమాలోచనలు జరుపున్నారు. అంతేగాకుండా అమరావతిలో ధర్మపోరాట సభ నిర్వహించాలని టిడిపి తలపిస్తోంది. దీనిపై కూడా కేజ్రీతో బాబు చర్చించే ఛాన్స్ ఉంది.