Delhi Cop: కొడుకును బెదిరించిందని కుక్కను చంపేసిన పోలీస్
ఓ పోలీస్.. వీధి కుక్క పట్ల దారుణంగా ప్రవర్తించాడు. బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాది ఎట్టకేలకు చంపేశాడు. సెక్టార్ 44లోని చల్లేరా గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

Delhi Cop
Delhi Cop: ఓ పోలీస్.. వీధి కుక్క పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కొడుకును బెదిరించిందనే కోపంతో బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాది ఎట్టకేలకు చంపేశాడు. సెక్టార్ 44లోని చల్లేరా గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ (35) కానిస్టేబుల్, అతని చిన్నికొడుకు పక్కింటి మీదుగా పోతున్న ప్రతిసారి అరుస్తుండేది. ఏదో ఒక రోజు హాని తలపెడుతుందని భావించి దానిని హతమార్చాలనుకున్నారు.
‘ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ కానిస్టేబుల్ కుటుంబానికి, స్థానికులకు మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడకు పోలీసులకు వచ్చి సద్దుమణిగేలా చేశారు. కానిస్టేబుల్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 429ప్రకారం కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు’ అని నోయిడా పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Also : ఛీ..ఛీ.. కుక్కనూ వదల్లేదు.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో కుక్క మొరుగుతుంటే అతని చిన్న కొడుకు భయపడిన ఘటన రికార్డ్ అయింది. అందుకే చంపాడంటూ స్థానికులు చెబుతున్నారు.