Delhi Elections 2025 : ఢిల్లీ దంగల్.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..
70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 138 స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

Delhi Elections 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 2వేల 696 పోలింగ్ కేంద్రాల్లో 13వేల 766 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించారు.
70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ..
70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 138 స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో కోటి 56 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 83 లక్షల 49వేల మంది పురుష ఓటర్లు ఉన్నారు. 71 లక్షల 74వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 25 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు.
2లక్షల 8వేల మంది ఫస్ట్ టైమ్ ఓటు వేయబోతున్నారు..
2లక్షల 8వేల మంది ఫస్ట్ టైమ్ ఓటు వేయబోతున్నారు. 3వేల పోలింగ్ స్టేషన్లని సున్నితమైనవిగా గుర్తించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో 1190 మంది ఓటు వేయనున్నారు. ఇంటి దగ్గరి నుంచి ఓటు వేసే 85 ఏళ్లు పైబడిన వారు ఫామ్ 12డీ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికల విధుల్లో మొత్తం లక్ష 9వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. నెక్ట్స్ ఏం జరగనుంది?
పోలింగ్ విధుల్లో 68వేల 733 మంది సిబ్బంది..
68వేల 733 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 220 కంపెనీలను మోహరించారు. 19వేల మంది హోమ్ గార్డు జవాన్లు, 35వేల 626 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశారు.