ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: నిర్భయ కేసులో సంచలన పరిణామం

శంషాబాద్ హత్యాచార ఉదంతం.. జాతీయ మీడియాను దాటి, ప్రపంచ మీడియాను కూడా తాకింది. ప్రపంచదేశాల్లోని ప్రముఖులు డాక్టర్ హత్యాచారంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కడుపు రగిలిన యువత తమకు సాధ్యమైన రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తుండగా.. వారిని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చట్టాల్ని.. గిట్టాల్ని పట్టించుకోకుండా నిందితుల్ని తక్షణం ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 2012లో సంచలనం రేకెత్తించిన ఢిల్లీ హత్యాచారం ఘటన నిర్భయ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కోర్టులో దాఖలైన మెర్సీ పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ పిటీషనర్‌కు సూచించిన కేజ్రివాల్ ప్రభుత్వం.
2012 నాటి కేసులో క్షమా బిక్ష పెట్టాలంటూ నిందితుడు పిటీషన్ పెట్టుకున్నారు. అయితే శంషాబాద్ లో అత్యాచారం కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో భావోద్వేగం కనిపిస్తోండగా.. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది.