Delhi Governor VK Saxena : ఐఐటీల్లో చదివారని గర్వపడనక్కర్లా, సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

 ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యుల్లానే ప్రవర్తిస్తారని ఐఐటీల్లో చదివామని గర్వపడనక్కర్లేదని సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే అంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.

Delhi Governor VK Saxena : ఐఐటీల్లో చదివారని గర్వపడనక్కర్లా, సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

DelhiGovernor CM Arvind Kejriwal

Updated On : April 10, 2023 / 3:30 PM IST

Delhi Governor VK Saxena : ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యుల్లానే ప్రవర్తిస్తారని ఐఐటీల్లో చదివామని గర్వపడనక్కర్లేదని సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే అంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ విద్యార్హతల గురించి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గౌవరనీయులైన ముఖ్యమంత్రిగారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల గురించి నేను విన్నానంటూ ఎవరైనా సరే తమ సర్టిఫికెట్లను చూసుకొని మరీ ఎక్కువగా గర్వపడకూడదని..కొన్ని రోజులుగా విద్యార్హతలకు సంబంధించి జరుగుతున్న చర్చను చూస్తున్నానని అన్నారు.

ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయంటూ కేజ్రీవాల్ పై సెటైర్లు వేశారు. డిగ్రీ అనేది విద్యకు ఓ రసీదు మాత్రమే..కానీ విద్య అనేది ఆయా మనుషలకు ఉండే జ్ఞానంలోను ప్రవర్తనలోనుఉంటుందన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు కూడా ఐఐటీల్లో చదువుకుని నిరక్ష్యరాస్యులుగా వ్యవహరించేవారిలానే ఉన్నాయంటూ చురకలు వేశారు.

గవర్నర్ సక్సేనా చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి, ఆప్ లీడర్ అతీశీ మండిపడ్డారు. దేశంలోకెల్లా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఢిల్లీ ఎల్జీ అవమానించేలా మాట్లాడారని.. ఐఐటీలలో చదివిన వారు పెద్ద పెద్ద సంస్థలకు సీఈవోలుగా పనిచేస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని విషషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను దాచేవారే ఇతరుల సర్టిఫికెట్లపై ప్రశ్నలు సంధిస్తారని..ఎల్జీ సక్సేనా కూడా తన సర్టిఫికెట్లు మీడియా ముందు చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ నేతలు అందరు కూడా తమ సర్టిఫికెట్లను చూపించాల్సిందిగా అతీశీ డిమాండ్ చేశారు.