Delhi : రసీదు లేకుండా కొరియన్ టూరిస్ట్‌కు రూ.5 వేలు జరిమానా విధించిన పోలీసు అధికారి.. అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్
ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినందుకు కొరియన్ టూరిస్ట్‌కు ఢిల్లీ పోలీసులు రూ.5000 జరిమానా విధించారు. అదీ రశీదు లేకుండా పైసలు వసూలు చేశారు. రశీదు లేకుండ జరిమానా వసూలు చేయడం లంచంతో సమానమని నెటిజన్లు మండిపడుతున్నారు.

Delhi
Delhi : ఢిల్లీ పోలీసు అధికారి మహేష్ చంద్ కొరియన్ టూరిస్ట్‌కు రసీదు లేకుండా రూ.5000 జరిమానా విధించడం వైరల్‌గా మారింది. అద్దె కారును నడుపుతున్న ఆ టూరిస్ట్ ఎల్లో లైన్ క్రాస్ చేసినందుకు జరిమానా విధించారు. రసీదు లేకుండా జారీ చేసిన జరిమానా లంచంతో సమానమని నెటిజన్లు మండిపడుతున్నారు.
Delhi Police : హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన పెళ్లికూతురు.. స్పందించిన ఢిల్లీ పోలీసులు
యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న దక్షిణ కొరియాకు చెందిన టూరిస్ట్ సియోక్గి మూన్ ఇటీవల ఇండియాకు వచ్చాడు. అద్దెకారులో ఢిల్లీలో ప్రాంతాలన్నీ పర్యటించాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆపివేసి జరిమానా విధించారు. అతను ఎల్లో లైన్ క్రాస్ చేయడంతో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ మహేష్ చంద్ రూ.5000 ఫైన్ అడిగారు. అంతేకాదు ఆ మొత్తాన్ని కేవలం క్యాష్ రూపంలో ఇవ్వమని పట్టుబట్టారు. జరిమానా చెల్లించి ఆ టూరిస్ట్ అక్కడి నుంచి బయటపడ్డాడు. తను యూట్యూబ్ లో ‘నాకు మొత్తం క్యాష్ ఇవ్వండి..మీరు ఇండియాలో కారు నడపకపోవడానికి కారణాలు’ అనే శీర్షికతో వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Bicycle Stunt : రోడ్డుపై ఘోరంగా ఫెయిలైన సైకిల్ స్టంట్.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు
Sweety Priya అనే ట్విట్టర్ యూజర్ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సిపి, ప్రధాని మోడీకి, నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ ‘ మహేష్ చంద్ అనే పోలీసు అధికారి ఈ విదేశీయుడికి రశీదు ఇవ్వలేదు. రూ. 5000 జరిమానా తీసుకున్నాడు. దయచేసి వారిపై చర్య తీసుకోండి’ అని పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు ‘వీడియోలో కనిపించిన సంబంధిత అధికారి విచారణ పెండింగ్‌లో ఉంచారు. అవినీతి పట్ల ఢిల్లీ పోలీసులు జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నారు’ అని రిప్లై చేశారు. ఇక అతనిపై విచారణ పెండింగ్‌లో ఉంచడంపై చాలామంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://t.co/GVY9mLhSNy
At 21:40 the traffic police officer named “Mahesh Chand” a corrupted one didn’t even give receipt to this foreigner and took Rs 5000 as fine.Please take some action against all of them. @dtptraffic @ArvindKejriwal @CPDelhi @narendramodi @nitin_gadkari pic.twitter.com/kiTH8T8vfH— Sweety Priya (@Miracle2204) July 20, 2023