Covid Cases In Delhi : ఢిల్లీలో కొత్తగా 53 కోవిడ్ కేసులు..గతేడాది ఆగస్టు 15 నుంచి ఇదే అత్యల్పం

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid Cases In Delhi : ఢిల్లీలో కొత్తగా 53 కోవిడ్ కేసులు..గతేడాది ఆగస్టు 15 నుంచి ఇదే అత్యల్పం

Delhi (1)

Updated On : July 11, 2021 / 8:28 PM IST

Covid Cases In Delhi దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 3 కోవిడ్ మరణాలు నమోదుకాగా,99మంది కోలుకున్నారని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. ఢిల్లీలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.07శాతంగా ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 76,823 కోవిడ్ టెస్ట్ లు చేసినట్లు తెలిపింది.

కొత్త కేసులు,మరణాలతో కలుపుకొని ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 14,35,083గా ఉండగా,మరణాల సంఖ్య 25,015కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 14,09,325మంది కోవిడ్ నుంచి కోలకొని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ప్రస్తుతం 743 యాక్టివ్ కేసులుండగా..ఇందులో 252 హోం ఐసొలేషన్ లో ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.