Delhi’s Covid Cases : కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతున్న ఢిల్లీ

ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 17,335 కోవిడ్ కేసులు,9 మరణాలు

Delhi’s Covid Cases : కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతున్న ఢిల్లీ

Virus2

Updated On : January 7, 2022 / 9:15 PM IST

Delhi’s Covid Cases : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 17,335 కోవిడ్ కేసులు,9 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 17.73శాతంగా నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.

అయితే గురువారం ఢిల్లీలో నమోదైన కోవిడ్ కేసుల కంటే..ఇవాళ 14శాతం అధికంగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఢిల్లీలో 15,097 కోవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఢిల్లీలో ప్రస్తుతం 39,873 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇక,ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 25,136కి చేరినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.

ALSO READ Covid Vaccination : వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి..150కోట్ల డోసుల పంపిణీ