Delhi Air Pollution : ఢిల్లీలో తీవ్ర గాలి కాలుష్యం.. స్కూళ్లల్లో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి.. ఆఫ్‌లైన్‌ విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ!

Delhi Air Pollution : ఆఫ్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యే 6వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ స్కూళ్లలో హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.

Delhi Air Pollution : ఢిల్లీలో తీవ్ర గాలి కాలుష్యం.. స్కూళ్లల్లో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి.. ఆఫ్‌లైన్‌ విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ!

Delhi Schools Mandate Face Masks,

Updated On : November 16, 2024 / 11:35 PM IST

Delhi Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ నగరమంతటా ప్రాథమిక పాఠశాలలు ఆన్‌లైన్ మోడ్‌కు మారిపోయాయి. ఆఫ్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యే 6వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ స్కూళ్లలో హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రధానంగా అవుట్‌డోర్ కార్యకలాపాలు పరిమితం చేసింది.

చదవడం, పెయింటింగ్, క్రాఫ్టింగ్ వంటి ఇండోర్ కార్యకలాపాలు, చెస్, క్యారమ్ వంటి ఆటలను ప్రోత్సహిస్తున్నారు. కార్‌పూలింగ్, హైడ్రేటెడ్‌గా ఉండటం, యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటి అనేక సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక అడ్వైజరీ కూడా ఢిల్లీ స్కూళ్లు జారీ చేశాయి. విద్యార్థుల కోసం N95 మాస్క్‌ల వాడకాన్ని తప్పనిసరి కూడా తప్పనిసరి చేశారు. ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న విద్యార్థుల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్కూల్ యాజమాన్యాలు పేర్కొన్నాయి.

వరుసగా రెండు రోజుల పాటు గాలి నాణ్యత “తీవ్రమైన” కేటగిరీలోకి చేరుకుంది. జాతీయ రాజధాని దేశంలో అత్యంత కాలుష్య స్థాయిని నమోదు చేయడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) GRAP 3 చర్యలను చేపట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 411 ఏక్యూఐతో నగరం గాలి నాణ్యత తీవ్రమైన స్థితికి చేరుకుంది. ఈ క్రమంలోనే 5వ తరగతి వరకు అన్ని పాఠశాలలు తదుపరి నోటీసు వచ్చేవరకు ఆన్‌లైన్ మోడ్‌కు మారుతాయని ముఖ్యమంత్రి అతిషి ప్రకటించారు.

డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD), న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ఈ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేయాలని ఆదేశించింది. ద్వారకలోని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజీవ్ హస్సిజా మాట్లాడుతూ.. ఆన్‌లైన్ అభ్యాసాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మైక్రోసాఫ్ట్ టీమ్స్, పూర్తి సిలబస్‌తో కూడిన స్మార్ట్‌బోర్డ్‌లను ఉపయోగించి ఉపాధ్యాయులు క్యాంపస్‌లో పాఠాలను బోధించడం కొనసాగిస్తారని అన్నారు.

Read Also : Best Camera Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నవంబర్‌లో రూ.30వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే!