బిగ్ బ్రేకింగ్ : ఆగస్టు నుంచి అక్టోబర్10 మధ్య జారీ చేసిన ట్రాఫిక్ చలానాల ఉపసంహరణ

ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీ-ఢిల్లీ బోర్డర్ కి దగ్గర్లోని నిజాముద్దీన్ బ్రిడ్జి,ఘాజీపూర్ మధ్యలో విధించిన చలానాలు ఉపసంహరించబడుతున్నట్లు ఆయన తెలిపారు.
అయితే జరిమానాగా తీసుకున్న కోట్ల రూపాయలపై ఏవిధంగా ముందుకెళ్తారన్న దానిపై స్పష్టత లేదు. జాతీయరహదారిపై PWD… గంటకు 70 కిమీ వేగ పరిమితి యొక్క సైన్ బోర్డ్‌ను ఏర్పాటు చేయగా,జాతీయ రహదారిపై గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణించినందుకు ఓవర్ స్పీడ్ అంటూ ట్రాఫిక్ చలాన్లు జారీ చేయబడ్డాయి. దీనిపై పెద్ద ఎత్తున కంప్లెయింట్స్ రావడంతో జారీ చేసిన ట్రాఫిక్ చలాన్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.
స్పీడ్ లిమిట్ ను గంటకు 60 కి.మీ చూపించే సైన్ బోర్డ్‌ను మార్చాలని పీడబ్యూడీ ని ట్రాఫిక్ పోలీసులు కోరారని,కానీ వారు మార్చలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం హైవే వెంట కెమెరాలు గరిష్ట వేగం గంటకు 70 కిమీతో మర్చబడినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ వసూలు చేసిన కోట్ల రూపాయలకు సంబంధించి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.