ఆ సుఖం కోసం భర్తను చంపేసింది

సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి. నిండు జీవితాలు అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..భర్తను చంపి వేసింది.
ఆత్మహత్య చేసుకున్నాడని కథలు అల్లింది. కానీ పోలీసు అధికారుల ముందు ఆమె వేసిన ప్లాన్స్ బెడిసికొట్టాయి. ఆమె, భర్తకు సుమరు 20 ఏళ్ల వయస్సు తేడా ఉందని పోలీసులు తెలిపారు. పైగా..సంతానం లేదని, వివాహంతో ఆ మహిళ సంతోషంగా లేదన్నారు.
భర్తను చంపడానికి వీరు బుర్మ, కరణ్ సహాయం తీసుకుందన్నారు. బర్మాతో వివాహేతర సంబంధం ఉందని, వీరు వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారని వెల్లడించారు. కరణ్, బుర్మ, భర్తతో పాటు ఆ మహిళ నివాసం ఉండేదన్నారు.
మాయాపురి పారిశ్రామిక ప్రాంతంలో చనిపోయిన వ్యక్తి పని చేస్తున్నాడని, బాధితుడికి నిద్రమాత్రలు ఇచ్చి..కరణ్ సహాయంతో మహిళ భర్త గొంతు నులిమి చంపేసిందన్నారు. అనంతరం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ..డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
కానీ అనుమానం వచ్చిన వైద్యులు తమకు ఇన్ఫామ్ చేశారన్నారు. దర్యాప్తు చేపట్టామని, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. కరణ్, ఆమె చెప్పిన విషయాలకు పొంతన లేదన్నారు.
లోతుగా విచారించగా..నేరం ఒప్పుకుందన, తాను బర్మాను వివాహం చేసుకోవాలని, ఆస్తిని కైవసం చేసుకొనేందుకు భర్తను చంపేసినట్లు ఒప్పుకుందన్నారు.