ఇంకేం కొంటాం : కారు పార్కింగ్ ఫీజు రూ.వెయ్యి

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 04:31 AM IST
ఇంకేం కొంటాం : కారు పార్కింగ్ ఫీజు రూ.వెయ్యి

Updated On : October 17, 2019 / 4:31 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా  పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో..పనిదినంలో 10గంటలకు కారు పార్కింగ్ ఫీజును రూ.1,000 వసూలు చేయాలని ఢిల్లీ అధికారుల కమిటీ నిర్ణయించింది. 

న్యూఢిల్లీలో 3.3 మిలియన్ల ఫోర్ వీలర్లు, 73. మిలియన్ల టూవీలర్లు ఉన్నాయి. ఢిల్లీవాసులు రోజుకు 500 కార్లు కొత్తగా కొనుగోలు చేస్తున్నారు. రోడ్లపై ప్రైవేటు కార్లు ఎక్కువగా తిరగకుండా, పార్కింగ్ స్థలాల్లో కార్లు పార్కింగ్ ను తగ్గించేందుకు వాహనాల పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది.

పార్కింగ్ స్థలం, వాహనం పార్కింగ్ చేసిన సమయం, ప్రాంతం, వేళలను బట్టి పార్కింగ్ ఫీజును నిర్ణయించామని అధికారులు చెప్పారు. ఢిల్లీలోని లజపత్ నగర్, కరోల్ బాగ్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఉన్నందువల్ల పార్కింగ్ ఫీజులు అధికంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.