Covishield Second Dose: కొవీషీల్డ్ సెకండ్ డోస్‌కు యాంటీబాడీస్ వచ్చేది 16శాతమే

డెల్టా వేరియంట్ పై కొవీషీల్ట్ వ్యాక్సిన్ పనితీరు విశ్లేషణ గురించి స్టడీ నిర్వహించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కొవీషీల్డ్ తీసుకున్న 58.1శాతం మంది బ్లడ్ శాంపుల్స్‌లో యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అవుతున్నట్లు కనిపించలేదు.

Covishield Second Dose: కొవీషీల్డ్ సెకండ్ డోస్‌కు యాంటీబాడీస్ వచ్చేది 16శాతమే

Blimburg Health Center

Updated On : July 4, 2021 / 11:36 AM IST

Covishield Second Dose: డెల్టా వేరియంట్ పై కొవీషీల్ట్ వ్యాక్సిన్ పనితీరు విశ్లేషణ గురించి స్టడీ నిర్వహించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కొవీషీల్డ్ తీసుకున్న 58.1శాతం మంది బ్లడ్ శాంపుల్స్‌లో యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అవుతున్నట్లు కనిపించలేదు. రెండు డోసులు పూర్తిగా తీసుకున్న 16శాతం మందిలోనూ న్యూట్రలైజ్ కావడం లేదు.

వ్యాక్సిన్ తో పాటు వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో చాలా మొత్తంలో యాంటీబాడీలు న్యూట్రలైజ్ అవుతున్నట్లు గ్రహించారు. ‘అందులో గమనించలేకపోయామంటే యాంటీబాడీలు లేవనే అర్థం. యాంటీబాడీలు ఏమీ లేకపోవడం వల్లనే టెస్టుల్లో కనిపించలేదు. కాకపోతే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇన్ఫెక్షన్ నుంచి ఇతర జబ్బులకు గురికాకుండా కాపాడుతుంది. కొన్ని కణాలు మధ్యవర్తిత్వంతో ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ అందించి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి.

Sars-CoV2 వైరస్ ను చంపేయడానికి లేదా హ్యూమన్ సెల్ లోకి ఎంటర్ అవకుండా యాంటీబాడీలు న్యూట్రలైజ్ చేసి కాపాడుతుంటాయి. అయితే ఇవి బీ1 వేరియంట్ పై పనిచేసిన దానికంటే డెల్టా వేరియంట్ పై చాలా తక్కువగా పనిచేస్తున్నాయి. కొవీషీల్డ్ మొదటి డోసు వేసుకున్న వారిలో వ్యాక్సిన్ సమర్థత డెల్టా వేరియంట్‌పై 78శాతం పనిచేస్తుండగా రెండు డోసులు తీసుకున్న వారిలో 69శాతం, ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 66శాతం, ఇన్ఫెక్షన్ సోకి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిపై 38శాతం పనిచేస్తున్నాయి.

వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యవంతుల సీరంతోనే స్టడీ నిర్వహించిన ఐసీఎమ్ఆర్.. అనూహ్యమైన యాంటీబాడీల పనితీరును గమనించింది. వృద్ధుల్లో, క్రోనిక్ సమస్యలు ఉన్నవారిలో ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువగా ఉన్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. అంటే మగాళ్ల కంటే మహిళల్లోనే ఎక్కువగా యాంటీబాడీలు ప్రొడ్యస్ అయినట్లు తెలిసింది.

65ఏళ్లు పైబడ్డ డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్రోనిక్ హార్ట్, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నవారు మూడో డోస్ కూడా తీసుకోవాలని డా. జాకోబ్ జాన్ అన్నారు.