Deve Gowda: ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దేవెగౌడ, కుమారస్వామి చర్చలు.. కీలక ప్రకటన చేసేందుకు సిద్ధం
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏలో

Deve Gowda, Kumaraswamy
Deve Gowda – NDA: మాజీ ప్రధాని, జేడీఎస్ (JDS) చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి (Kumaraswamy) ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. పార్లమెంటు ప్రాంగణంలో వీరి సమావేశం జరిగిందని జాతీయ మీడియా పేర్కొంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేయడంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై కూడా తుది చర్చలు జరిపినట్లు సమాచారం. శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏలో జేడీఎస్ లో చేరడంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
శుక్రవారం తాము అన్ని వివరాలను తెలియజేస్తామని కుమారస్వామి మీడియాకు తెలిపారు. సీట్ల విషయంలో ఇప్పటివరకు తమ పార్టీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, అలాగే, బీజేపీ ఎటువంటి ప్రతిపాదనా చేయలేదని అన్నారు. తమ రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల పరిస్థితి, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిస్థితులు వంటి వాటిపై చర్చిస్తామని చెప్పారు.
Vijayashanti : కమలం పార్టీలో కలకలం.. నాకా అలవాటు లేదంటూ సొంత పార్టీ నేతలపైనే విజయశాంతి సీరియస్