Diarrhea: ఆ ప్రాంత వాసులను వణికిస్తున్న డయేరియా.. ఐదుగురి మృతి.. 120 మందికి చికిత్స

డయేరియా బాగా ముదిరిపోయాక రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. డయేరియా ఎందుకు ఇంతలా..

Diarrhea: ఆ ప్రాంత వాసులను వణికిస్తున్న డయేరియా.. ఐదుగురి మృతి.. 120 మందికి చికిత్స

Diarrhoea

Updated On : December 17, 2023 / 2:31 PM IST

Rourkela: ఒడిశాలోని రూర్కెలా నగరంలో డయేరియా ప్రబలుతోంది. అతిసార వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోందని అక్కడి అధికారులు తెలిపారు.

ఆ ఆసుపత్రికి ప్రతిరోజు కొత్తగా 25-30 మంది డయేరియాతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్నారని వివరించారు. డయేరియా బాగా ముదిరిపోయాక రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. డయేరియా ఎందుకు ఇంతలా వ్యాపిస్తుందో ఇంకా గుర్తించలేదని అన్నారు.

ముఖ్యంగా చేంద్, తార్కెరా, పాన్‌పోష్, నల్లా రోడ్, ప్లాంట్ సైట్, లేబర్ టెనిమెంట్, బిర్జాపల్లిలోని మురికివాడల్లో డయేరియా వ్యాపిస్తున్నట్లు చెప్పారు. నీటి సరఫరాలో ఏవైనా లీకేజీలు జరుగుతున్నాయా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు తమ బృందాలు వెళ్తున్నాయని తెలిపారు.

Libya : లిబియా తీరంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు మృతి