Project Madad: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ట్రైనింగ్ ఇస్తోన్న మదద్ టీం

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా వారికి అవసరమైన సలహాలు, సూచనలిచ్చేందుకు ...

Project Madad: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ట్రైనింగ్ ఇస్తోన్న మదద్ టీం

Rmp Doctors

Updated On : May 24, 2021 / 10:01 AM IST

Project Madad: గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా వారికి అవసరమైన సలహాలు, సూచనలిచ్చేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, ఉద్యోగులు ఓ టీంగా ఏర్పడి స్వచ్ఛందంగా ‘ప్రాజెక్టు మదద్‌’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భారత డాక్డర్లు కూడా ఇందులో భాగం కానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలకు, వైద్యులకు కొవిడ్‌ చికిత్సపై సూచనలు చేస్తారు. కొవిడ్‌ లక్షణాల గుర్తింపు, స్వల్ప లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరే ట్రీట్మెంట్, టీకాపై సమాచారం ఇవ్వడం, రోగులు అనవసరంగా ఎక్కువ మందులు వేసుకోకుండా చూడటం వంటి వాటిపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

దవాఖానాల్లో, స్థానిక కొవిడ్ సెంటర్లలో బెడ్ల అందుబాటుపై ఎప్పటికప్పుడు డాక్టర్లకు సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలుపెట్టనుంది మదద్‌ బృందం. టీమ్‌ మండల స్థాయి ఆర్‌ఎంపీ సంఘాలతో సమన్వయమై పని చేయనుంది.

వారంలో రెండు రోజుల పాటు జూమ్‌ ప్లాట్‌ఫాం ద్వారా వైద్యులతో సమావేశమై సూచనలు ఇస్తుంది. మదద్‌ టీమ్ ఇప్పటివరకు 150 మంది ఆర్‌ఎంపీలతో కొవిడ్‌ పై సమాచారం ఇచ్చింది.