DMK MP Kanimozhi : ఎంపీ కనిమొళికి కరోనా.. ఆందోళనలో డీఎంకే
తమిళనాడులో డీఎంకే అధికారానికి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ కనిమొళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Dmk Mp Kanimozhi Tests Positive For Covid 19
DMK MP Kanimozhi : తమిళనాడులో డీఎంకే అధికారానికి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ కనిమొళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విరామం లేకుండా రోజువారీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కనిమొళి అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు కరోనావైరస్ సోకింది. కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలింది.
ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కనిమొళి విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను సీఎం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విస్తృత పర్యటనలతో ఆమెకు కరోనా సోకింది.
పాజిటివ్ తేలిన వెంటనే కనిమొళి ఐసోలేషన్‌లోకి వెళ్లారు. చెన్నెలోని అపోలో ఆస్పత్రి ఆమె చేరినట్లు పార్టీ వర్గాల సమాచారం. కొద్ది రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారానికి దూరం ఉండనున్నారు. కనిమొళికి కరోనా సోకడంతో డీఎంకే ఆందోళనలో పడింది.