విడుదలయ్యే వరకు గడ్డం గీసుకోనని మాజీ సీఎం ప్రతిజ్ఞ
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా 29 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు ముందు కశ్మీర్‌లోని కీలక నేతలతోపాటు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రభుత్వం గృహ నిర్బంధంలోకి తీసుకుంది. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్న ఒమర్.. తాను గెడ్డం గీసుకోబోనని భీష్మించుకు కూర్చున్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.
ఒమర్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు ఆయన గృహ నిర్బంధంలో ఉన్న హరి నివాస్‌లో కలిశారు. ఒమర్‌ను కలిసిన అనంతరం సాఫియా మాట్లాడుతూ.. ఒమర్ మాసిన గెడ్డంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు గీసుకోవడం లేదని ప్రశ్నిస్తే.. నిర్బంధం నుంచి తాను విడుదలయ్యే వరకు గెడ్డం తీయబోనన్నారని తెలిపారు.
Also Read : కడుపులోకి దూసుకెళ్లిన రాకెట్ : వేదికపైనే సింగర్ సజీవదహనం