January 22nd Special : జనవరి 22న పిల్లల్ని కంటారట.. కొత్త వ్యాపారాలకూ అదే రోజు ముహూర్తం.. ఆ రోజు ప్రత్యేకత ఏంటి?
జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా ఉన్న గర్భిణీలు కోరుకుంటున్నారు. కొత్త వ్యాపారస్తులు అదే రోజు తమ వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి?

January 22 Special
January 22 Special : జనవరి 22, 2024 .. చాలా ప్రత్యేకత సంతరించుకున్న రోజు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేకమంది గర్భిణిలు ఈ రోజున పిల్లలు కనాలని నిర్ణయం తీసుకున్నారట. ఇదే రోజు చాలామంది తమ కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తున్నారట. అసలు ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటి?

January 22nd Special
Ram Mandir : అయోధ్య రామమందిరంలో మొదటి బంగారు తలుపు
గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో చాలామంది గర్భిణీలు జనవరి 22 న పురుడు పోయమని రిక్వెస్ట్ చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారట. ఇదే రోజు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనేకమంది డిసైడ్ అయ్యారట. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి? అంటే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్కార్యం జరగబోతోంది. ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ తేదీన తమ పిల్లలు పుట్టాలని అనేకమంది మహిళలు కోరుకుంటున్నారట. దాదాపుగా 100 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తైంది. ఈ ఆలయ ప్రారంభం కన్నా శుభదినం లేదని అంతా భావిస్తున్నారు. ఇక ఈరోజు పుట్టబోయే పిల్లలకు రాముడి పేరునే పెట్టుకుంటామని చెబుతున్నారట. శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంటారు. అదే నమ్మి అనేకమంది ఈరోజున తమ బిడ్డ పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీలు క్యూ కట్టారట. ఈ ముఖ్యమైన రోజున తమ పిల్లలు పుట్టాలని అనేక కుటుంబాలు పట్టుబట్టాయని డిపార్టెమెంట్ హెడ్ డాక్టర్ సీమా ద్వివేది వెల్లడించారు. ఇప్పటికి ప్రతి రోజు 14 నుండి, 15 మంది గర్భిణీల అభ్యర్ధనను స్వీకరించామని .. నార్మల్ డెలివరీకి హామీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి సిజేరియన్ అవసరమైన వారికి మాత్రమే డేట్ సర్దుబాటు చేయగలమని హామీ ఇచ్చినట్లు డాక్టర్ సీమా ద్వివేది పేర్కొన్నారు.
Chiranjeevi : అయోధ్య రామమందిరం నుంచి ఆహ్వానం వచ్చింది.. హనుమాన్ టికెట్ నుంచి కొంత డబ్బుని..
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే పురోహితులను శుభదినం కోసం సంప్రదించడం సాధారణం. అయితే జనవరి 22 కంటే శుభదినం లేదని భావిస్తున్న వారంతా అదే రోజు తమ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. దీంతో పురోహితులు కూడా ఆ రోజు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. అలా జనవరి 22వ తేదీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.