హాస్పిటల్‌లో లేడని.. 73ఏళ్ల డాక్టర్‌ని కొట్టి చంపేశారు

స్థానికుల ఆగ్రహం సీనియర్ డాక్టర్ ప్రాణం తీసింది. అస్సాంలోని జోరాట్ జిల్లాలో ఉన్న టీ ఎస్టేట్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. వైద్యం సరిగా చేయలేదని స్థానికులు చేసిన దాడిలో డాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స తీసుకుంటుండగానే తుది శ్వాస విడిచాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 73ఏళ్ల డెబెన్ దత్తా గార్డెన్ కు సంబంధించిన డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సోమ్రా మాఝీ అనే వ్యక్తికి ఎస్టేట్ హాస్పిటల్‌లో చికిత్స అందించలేదని అందుకే ప్రాణాలు కోల్పోయాడని తెలిపాడు. తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన వ్యక్తికి చికిత్స అందించడంలో డాక్టర్ తప్పు చేశాడని అందుకే చనిపోయాడంటూ మృతుని బంధువులు, స్థానికులు జోరాట్ మెడికల్ కాలేజిలో ఉన్న వైద్యుడి పై దాడిచేశారు.
శనివారం ఎస్టేట్ లో పని చేస్తున్న మహిళకు ఆరోగ్యం బాలేదు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ, డాక్టర్ అందుబాటులో లేకుండా కేవలం ఫార్మసిస్ట్ మాత్రమే హాస్పిటల్ లో ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు డాక్టర్ వచ్చాడు. అప్పటికీ కోపోద్రిక్తులు అయి ఉన్న స్థానికులు దాడి డాక్టర్ గదిలోనే దాడి చేసి తాళం వేశారు.
సకాలంలో వైద్యం అందక.. సతమతమవుతోన్న డాక్టర్ ఎట్టకేలకు చికిత్స ప్రారంభించినా అప్పటికే ఆలస్యం అవడంతో ప్రాణం పోయింది. జోరాట్ పట్టణానికి 22కి.మీ దూరంలో ఉన్న టాటా టీ ఎస్టేట్ కు సంబంధించిన కార్మికులు చికిత్స విషయంలోనే ఈ పొరబాటు జరిగింది.