Dog Saves Its Friend : నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను కాపాడిన మ‌రో శున‌కం

నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను మ‌రో శున‌కం మునిగిపోకుండా కాపాడింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయింది. గాబ్రియెల్ కార్నో ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 20 ల‌క్ష‌ల మంది వీక్షించారు.

Dog Saves Its Friend : నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను కాపాడిన మ‌రో శున‌కం

dog saves friend

Updated On : September 29, 2022 / 9:55 PM IST

dog saves its friend : నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను మ‌రో శున‌కం మునిగిపోకుండా కాపాడింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయింది. గాబ్రియెల్ కార్నో ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 20 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియోలో కుక్క ఓ కొమ్మ‌ను తీసుకురావ‌డానికి న‌దిలో దూకుతుంది.

అయితే ఆ కొమ్మ‌ను కుక్క ప‌ట్టుకున్న‌ప్ప‌టికీ నీటి ప్ర‌వాహంలో బ్యాలెన్స్ కోల్పోయి మునుగుతుండ‌టం క‌నిపించింది. అదే స‌మ‌యంలో అక్కడ గ‌ట్టుపై ఉన్న మ‌రో కుక్క కొమ్మ‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుని నీటి ప్ర‌వాహంలో కుక్క కొట్టుకుపోకుండా కాపాడుతుంది. త‌న ఫ్రెండ్‌ను కాపాడిన కుక్క‌ను ప‌లువురు మెచ్చుకోగా, మ‌రికొంద‌రు ఈ వీడియో రికార్డు చేసిన తీరును ఆక్షేపించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.