ICMR చీఫ్‌కు కరోనా పాజిటివ్.. ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరిన బలరాం

ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్ డా. బలరాం భార్గవకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు. అందిన వివరాల ప్రకారం.. 99లక్షల 79వేల 447మందికి కరోనా పాజిటివ్ రాగా గడిచిన 24గంటల్లో 22వేల 890మందికి కన్ఫామ్ అయింది. మొత్తం మీద లక్షా 44వేల 789మందికి కరోనా మృతులు జరిగాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెల్లడించింది.
ఇండియాలో Covid-19 రికవరీ రేట్ 95.40 శాతంగా ఉండగా.. ఫెటలిటీ రేట్ అనేది 1.45గా ఉంది. మొత్తం రికవరీల సంఖ్య 95లక్షల మార్క్ దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం చెప్పింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) లెక్కల ప్రకారం.. 15కోట్ల 89లక్షల 18వేల 646మందికి పరీక్షలు నిర్వహించారు.
ఇండియాలో మహారాష్ట్ర అత్యంత దారుణంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ 18లక్షల 88వేల 767 కేసులు నమోదయ్యాయి. 70శాతం నమోదవుతున్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ ల నుంచి ఎక్కువ నమోదవుతున్నాయి.