Toothbrush Sculpture : 80,000 టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌.. గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌

80 వేల టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌ నిర్మించి ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గిన్నిస్‌ రికార్డ్‌ సాధించింది.

Toothbrush Sculpture : 80,000 టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌.. గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌

Dr Reddy's Guinnes Records Toothbrush Sculpture (1)

Updated On : September 30, 2021 / 2:29 PM IST

Dr Reddy’s toothbrush sculpture : ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గిన్నిస్‌ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద టూత్ బ్రష్ మినార్  సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధిచింది. ఈ టూత్ బ్రష్ ల మినార్ లో 80 వేల టూత్‌బ్ర్‌షలను ఉపయోగించింది. మరి ఇంతకీ ఇటువంటి బ్రష్ ల విగ్రహం డాక్టర్ రెడ్డీస్ ఎందుకు తయారు చేసింది? ఎక్కడ? అంటే..

దంత సంరక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేయడం లక్ష్యంగా..నవీ ముంబైలోని టెర్నా డెంటల్‌ కాలేజిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్మించిన టూత్‌బ్ర్‌ష శిల్పం ‘ఫాస్ట్‌మినార్‌’కు గిన్నిస్ రికార్డు అవార్డు లభించింది. 80 వేల టూత్‌బ్రష్ లతో 40 అడుగులు పొడుగు ఉన్న ఈ  టూత్‌ బ్రష్‌ ల ‘ఫాస్ట్ మినార్’ ప్రపంచంలోనే అతి పెద్దది అని వెల్లడించింది.

Read more : 35kg Mask : ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. ఎందుకు? ఎక్కడ తయారుచేశారు.. ?

ఈ ఫాస్ట్‌మినార్‌ నిర్మాణంలో ఉపయోగించిన టూత్‌బ్రష్ లను దేశవ్యాప్తంగా ఉన్న 8,890 మంది దంతవైద్యులు అందించారు. టెర్నా డెంటల్‌ కళాశాలలో 365 రోజుల పాటు ఈ ఫాస్ట్‌మినార్‌ ప్రదర్శనలో ఉంటుందని డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం వెల్లడిచింది. ఆ తర్వాత ఈ బ్రష్ మినార్ ను పడగొట్టి ఆ టూత్‌ బ్ర్‌షలన్నింటినీ రీసైకిల్‌ చేసి నిర్మాణ కార్యకలాపాల్లో ఉపయోగిస్తామని తెలిపింది.

ఈ టూత్ బ్రష్ మినార్ ను హైదరాబాద్ కు చెందిన ఫార్మా మేనేజర్ బృందం రూపొందించింది. ఈ ‘ఫాస్ట్ మినార్’ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, డెంటర్ కాలేజీ అధికారుల సమక్షంలో ఇండియన్ టెండల్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీ జన్ రల్ డాక్టర్ అశోక్ ధోబ్లే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ ధోబ్లే మాట్లాడుతు..భారత దేశంలో ప్రతీ ఐదుగురిలో ఒకరికి దంత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలకు కారణ దంత సమస్యలపై (Dentine hypersensitivity)అవగాహన లేకపోవటమేనని..చాలా ముందుగా గుర్తిస్తే ఈ సమస్యల్ని క్లియర్ చేసుకోవచ్చని తెలిపారు.

Read more : shortest cow Rani Died : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి